టీ20 వరల్డ్ కప్ జట్టులో రింకూ సింగ్‌ను తీసుకొని పోవడానికి కారణం ఇదే

by Disha Web Desk 12 |
టీ20 వరల్డ్ కప్ జట్టులో రింకూ సింగ్‌ను తీసుకొని పోవడానికి కారణం ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌లో గత రెండు సీజన్లుగా మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా రింకూ సింగ్ భీకర ఫామ్ కొనసాగిస్తున్నాడు. 2023 సీజన్ లో రాణించింనందుకు రింకూ ను పలు టీ20 సిరీస్ లకు సైతం ఎంపిక చేశారు. అలాగే ఈ సంవత్సరం టీ20 వరల్డ్ కప్ లో రింకూ సింగ్ కు కచ్చితంగా స్థానం దక్కుందని అందరూ భావించారు. కానీ చివరి క్షణంలో రింకూకు మెయిన్ జట్టుకు బదులుగా స్టాండ్ బై ప్లేయర్ గా తీసుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా బీసీసీఐపై క్రికెట్ అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. కాగా ఈ రోజు టీ20 కెప్టెన్ రోహిత్, టీ20 జట్టు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, ఇతర బీసీసీఐ అధికారులతో సమావేశం అయ్యారు. అనంతరం అగార్కర్ మీడియాతో మాట్లాడుతూ.. దురదృష్టవశాత్తూ టీ20 వరల్డ్ కప్ జట్టులో రింకు సింగ్‌కు స్థానం కల్పించలేకపోయామని అన్నారు. జట్టులో ఎక్స్ ట్రా బౌలర్ అవసరం ఉండటంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని.. తెలిపారు.

Next Story

Most Viewed