అనుమానాస్పద స్థితిలో ఒకరు మృతి

by Sridhar Babu |
అనుమానాస్పద స్థితిలో ఒకరు మృతి
X

దిశ, ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ మండలం రహాపెల్లి గ్రామానికి చెందిన చునార్కర్ రవీందర్ (35) అనుమానాస్పదంగా మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భార్య కళావతి అదే గ్రామానికి చెందిన అక్కపెళ్లి రవీందర్ తో వివాహేతర సంబంధం పెట్టుకుని ఫోన్ లో మాట్లాడుతుందన్న అనుమానంతో భార్య, భర్త ఇద్దరి మధ్య తరుచూ గొడవ పడేవారు.

పెద్దలు కలిసి ఉండాలని నచ్చజెప్పినప్పటికీ ఎలాంటి మార్పు రాలేదు. ఇదే క్రమంలో గురువారం రాత్రి ఇంట్లో రవీందర్ అనుమానాస్పదంగా దూలానికి ఉరేసుకున్నాడు. భార్య కళావతి భర్త అడ్డు తొలగించేందుకు ప్రియుడు అక్క పెళ్లి రవీందర్ తో కలిసి ఉరిబిగించి రవీందర్ ను హత్య చేశారని మృతుడి తమ్ముడు ఆనంద్ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సతీష్ పేర్కొన్నారు.

Next Story

Most Viewed