తెలంగాణలో షాకింగ్ ఘటన.. ఇష్టం లేని పెళ్లి చేశారని నవ వరుడు ఆత్మహత్య..!

by Satheesh |
తెలంగాణలో షాకింగ్ ఘటన.. ఇష్టం లేని పెళ్లి చేశారని నవ వరుడు ఆత్మహత్య..!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇష్టం లేని పెళ్లి చేశారని నవ వరుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కుమురం భీం జిల్లాలో జరిగింది. వివరాల ప్రకారం.. కుమురం భీం జిల్లాకు చెందిన ఉమేష్‌కు (27) ఈ నెల 5వ తేదీన ఓ యువతితో పెద్దలు వివాహం జరిపించారు. అయితే, ఈ పెళ్లి ఉమేష్‌కు ఏ మాత్రం ఇష్టం లేదు. ఇంట్లో పెద్దలను కాదనలేక ఇష్టం లేకపోయిన బలవంతంగా వివాహం చేసుకున్న అతడు.. అప్పటి నుండి తీవ్ర మనస్థాపానికి గురి అయ్యాడు. ఈ క్రమంలోనే శుక్రవారం ఇష్టం లేని పెళ్లి చేశారని పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఉమేష్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. పెళ్లి జరిగి నెలల రోజులు కాకముందే కొడుకు మృతి చెందడంతో ఉమేష్ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story